తెలంగాణ లో మరో 119 గురుకులాల ఏర్పాటు అభినందనీయం – ఎం బి సి చైర్మన్ తాడూరి శ్రీనివాస్

తెలంగాణ లో మరో 119 గురుకులాల ఏర్పాటు అభినందనీయం – ఎం బి సి చైర్మన్ తాడూరి శ్రీనివాస్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు బడుగు బలహీన వర్గాల విద్య పట్ల ఎంతో చిత్తశుద్ధితో వ్యవహరిస్తూ కేజీ టూ పీజీ లో భాగంగా ఈ రోజు నియోజకవర్గానికి ఒకటి చొప్పున మరో 119 మహాత్మా జ్యోతిభాఫూలే గురుకుల పాఠశాలలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిచడం జరిగింది.

అందులో భాగంగానే మన్సూరబాద్ లో
ముషీరాబాద్, జూబిలీహిల్స్, గోశామహల్ నియోజకవర్గాలకు సంబంధించిన పాఠశాలలను ఈ రోజు ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్యులు మహమూద్ అలీ గారు, కొప్పుల ఈశ్వర్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు మరియు ఎం బి సి కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ గారు, శాసన సభ్యులు ముఠా గోపాల్ గారు, బిసి కమిషన్ చైర్మన్ రాములు గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం గారు, కమిషన్ సభ్యులు కృష్ణ మోహన్, ఆంజనేయులు గౌడ్, గౌరి శంకర్, ఎంబిసి సీఈఓ ఆలోక్ కుమార్ గారు, గురుకుల పాఠశాలల సెక్రటరీ మల్లయ్య బట్టు గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్బంగా తాడూరి శ్రీనివాస్ గారు మట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి 2014 వరకు అరకొర నిధులతో కేవలం 19 పాఠశాలలకే పరిమితమైన గురుకుల పాఠశాలల రూపురేఖలు మార్చి 2017-18 విద్య సంవత్సరంలో ఒకే రోజు 119 గురుకుల పాఠశాలల్ని ప్రారంభించి బడుగు బలహీన వర్గాల పిల్లల భవిష్యత్తును మార్చిన గొప్ప నాయకునిగా ఈ రోజు కేసీఆర్ గారు అందరి మదిలో నిండిపోయారు.

తెలంగాణ అభివృద్ధి చెందాలన్న, కలలు గన్న బంగారు తెలంగాణ సిద్ధించాలన్న కేవలం విద్యారంగంతోనే సాధ్యమవుతుందని విశ్వసించిన ముఖ్యమంత్రి గారు ఎంతో నాణ్యమైన విద్యని అందించడానికి ఎక్కడా వెనుకడుగు వేయకుండా అన్ని విధాలుగా సకల సౌకర్యాలతో కూడిన భవనాలను ఎంపిక చేయడం జరిగింది అన్నారు.

గత సంవత్సరం విద్యార్థులు సాధించిన ప్రగతిని దృష్టిలో పెట్టుకొని, వారి నుండి వస్తున్న అపారమైన ఆసక్తిని పరిగణలోకి తీసుకుని ఈ గురుకుల విద్యని ఇంకా వ్యాప్తి చెందించాలనే ఉధ్యేశంతో ఈ విద్య సంవత్సరం కూడా మరో 119 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయడం జరిగింది అని వెల్లడించారు. ఈ రోజు నాటికి మొత్తము 281 గురుకుల పాఠశాలలు తెలంగాణ వ్యాప్తంగా ఏర్పడటం వల్ల మొత్తం 92,340 మంది విద్యార్థులు కార్పోరేట్ స్థాయి విద్యతో పాటు, ఆటపాటలను పోషక విలువలు కలిగిన ఆహారాన్ని ప్రతి రోజు అందుకుంటున్నారు. అంతేకాక 5335 మంది అధ్యపకులుగా, మరో 2900 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ ఈ పాఠశాలల ద్వారా నియమితులయ్యారు అని తెలిపారు.

0 replies

Leave a Reply

Want to join the discussion?
Feel free to contribute!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *