హాలియా లో నిర్వహించిన తెలంగాణ కుమ్మర సంఘం ఆధ్వర్యంలో ఎం.బిసి కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ గారు

తెలంగాణ కుమ్మర సంఘం ఆధ్వర్యంలో నాగార్జునసాగర్ నియోజకవర్గం లోని హాలియా లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి బహిరంగ సభకు ఎం.బిసి కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ గారు, నియోజకవర్గ ఇంచార్జి మాజీ శాసన సభ్యులు నోముల నర్సింహయ్య గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ వై వి రావు గారు, విజయేందర్ రెడ్డి గార్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

తాడూరి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తరువాత జరిగిన అభివృద్ధి గత 70 సం ల కాలంలోని పాలకులు చేయలేకపోయారని అన్నారు.

కానీ తెలంగాణ ఏర్పడిన మూడున్నర సంవత్సరాల కాలంలోనే రాష్ట్రం లో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి అని, అందులో భాగంగానే అత్యంత వెనుక బడిన వారిని గుర్తించడం అనేది ఎంతో గొప్ప విషయం అని చెప్పారు.

ఎం బి సి కులస్తులు అందరూ గతంలో ఎంతో సాంస్కృతిక వైభవం కలిగి ఉండి గొప్పగా జీవనం సాగించారు అని ఆయన చెప్పారు.

తెలంగాణ రాష్ట్రం లో కె సి ఆర్ గారు సుపరిపాలన సాగిస్తు ఎం.బి.సి లకు పెద్ద పీట వేస్తున్నారని, ఎంబీ.సి లు ఆర్థికంగా, అభివృద్ధి చెందాలనేది కె సి ఆర్ గారి ఆశయం అని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం దేశంలోని మొత్తం బిసి లకు కేవలం 1980 కోట్లు కేటాయిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం రాష్ట్రం లోని బి సి ల ఆర్థికాభివృద్ధికి 5940 కోట్లు కేటాయించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ఎం బి సి కార్పొరేషన్ ద్వారా తమ కార్యాలయంలో అన్ని కుల సంఘ నాయకులతో ఇప్పటికే చర్చలు జరిపినట్టు, వారి వారి ఆర్థికాభివృద్ధి కి తీసుకోవాల్సిన చర్యల గురించి వివరాలు సేకరించి, కార్యాచరణ రూపొందిస్తున్నామని అన్నారు.

త్వరలోనే నివేదిక రూపొందించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లబోతున్నామని తాడూరి తెలిపారు.

వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చే కార్యక్రమాలు ఎం.బి.సి కార్పొరేషన్ ద్వారా చేపట్టనున్నట్టు, వృత్తి ని ఆధునీకరించి వారి యొక్క ఆర్థికాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, అత్యాధునిక యంత్రాలను పరిశీలించేందుకు మంత్రి వర్యులు జోగు రామన్న గారు, అధికారులు, కుల సంఘ నాయకుల తో కలిసి త్వరలోనే వివిధ రాష్ట్రాల పర్యటన చేయబోతున్నమని వివరించారు.

ఎం.బి.సి లకు రాజ్యాధికారం కల్పించాలని సంకల్పించిన కె సి ఆర్ గారికి పాదాభివందనాలు తెలిపారు. నిన్న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కూడా ఇద్దరు బి సి బిడ్డలకు చోటు నివ్వడం అనేది చరిత్రలో ఎప్పుడు జరగలేదని చెప్పారు. త్వరలోనే కె సి ఆర్ గారి పాలనలో ఎం బి సి లు ఉన్నత స్థాయికి చేరుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో కుమ్మర సంఘం అధ్యక్షులు నడికుడి జయంత్ రావు, యువత విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు బొడ్డుపల్లి చంద్రశేఖర్, దయానంద్, రాజమల్లయ్య, భిక్షపతి, బాలకృష్ణ ఇతర స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

139 total views, 5 views today

0 replies

Leave a Reply

Want to join the discussion?
Feel free to contribute!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *