అసెంబ్లీ ఆవరణలో శ్రీ తాడూరి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మట్టి తో తయారుచేసిన నీటి కూజాలను అందించడం జరిగింది

ఈరోజు అసెంబ్లీ ఆవరణలో ఎం.బీ.సీ కార్పొరేష్ చైర్మన్ శ్రీ తాడూరి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మట్టి తో తయారుచేసిన నీటి కూజాలను తెలంగాణ రాష్ట్ర మంత్రులకు, మరియు శాసనసభ్యులకు అందించడం జరిగింది.

ఈ కార్యక్రమం లో అసెంబ్లీ స్పీకర్ మధుసూధనా చారి, మండలి చైర్మన్ స్వామి గౌడ్, మండలి వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్,మంత్రులు తన్నీరు హరీష్ రావు, జోగు రామన్న, జగదీష్ రెడ్డి ,జూపల్లి క్రిష్ణా రావు, ఇంద్రకరణ్ రెడ్డి, ఎం.బి.సి. కార్పొరేషన్ సీఈఓ అలోక్ కుమార్ పలువురు శాసన సభ్యులు, శాసనమండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

76 total views, 2 views today

నిజామాబాద్ పట్టణంలో ఎం.బి.సి కులస్థులు సమావేశానికి తాడూరి శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

నిజామాబాద్ పట్టణంలో మహతి రమేష్ నాయి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎం.బి.సి కులస్థులు సమావేశానికి ఎం.బి.సీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

తాడూరి మాట్లాడుతూ కె సి ఆర్ గారు ఎం బి సీలు ఉన్నారని గుర్తించి దేశం లో ఎక్కడ లేని విధంగా ఎం బి. సి కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1000 కోట్ల రూపాయలను కేటాయించడం శుభ పరిణామం అని వెల్లడించారు. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు , శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు పలుమార్లు చర్చల్లో తమ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ఎం.బీ.సీ లకు త్వరితగతిన రుణాలు మంజూరు చేయించి సహాయపడగలరని తనను కోరినట్టు , వారికి ఎం.బీ.సీ ల పట్ల అపారమైన ప్రేమ ఉంది ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.

ప్రభుత్వం గత 70 సం కాలంలో చేయలేని పనులను కేవలం మూడున్నర ఏండ్ల లో చేసి చూపించింది అన్నారు.

గతం లో ఎన్నడూ లేని విధంగా కుల సంఘ నాయకులతో గంటల తరబడి చర్చించి వారి వారి అవసరానికి అనుగుణంగా స్కీం లను రూపొందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ అని తెలిపారు.

కుల వృత్తుల పై ఆధారపడి జీవించే వారిని ఆధునీకరించి వారి నైపుణ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలను శ్రీకారం చుట్టినట్టు ఇప్పటికె నాయీబ్రాహ్మణులకు వృత్తి నైపుణ్య శిక్షణ అందించామని అన్నారు. వృత్తి పని పై కాకుండా వృత్తి మైగ్రేషన్ కోరుకునే చదువుకున్న యువత కోసం కూడ ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్టు తాడూరి వెల్లడించారు.

బంగారు తెలంగాణ సాధనలో సంక్షేమ పథకాలు పేద వారి గడప గడపకు చేరవేయడమే తెలంగాణ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉధ్యేశంగా గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ముందుకు దూసుకుపోతున్నారని చెప్పారు.

రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో మహతి రమేష్, శంకర్ నాయి, రమణ రజక ఇతర ఎం బి సి కుల సంఘ స్థానిక నాయకులు పాల్గొన్నారు.

306 total views, no views today

కుల వృత్తుల‌ను ప్రోత్స‌హించండి : ఎంబీసీ కార్పోరేష‌న్ చైర్మ‌న్ తాడూరి శీనివాస్

కుల వృత్తుల‌ను ప్రోత్స‌హించండి..
ప‌ర్య‌వర‌ణాన్ని కాపాడండి…స్పిక‌ర్ మ‌ధుసూధ‌న చారీ..
ఎంబీసీ కార్పోరేష‌న్ వినూత్న నీళ్ల పాత్ర‌…

కుల వృత్తుల‌ను ప్రోత్స‌హించ‌డంలో భాగంగా ఎంబీసీ కార్పోరేష‌న్ మ‌ట్టితో మంచినీళ్ల ప్లాస్క్ ను త‌యారు చేయించింది…ప్ర‌ధానంగా రానుంది ఎండ‌కాలంలో కావ‌డం, చ‌ల్ల‌టీ మంచీ నీటి అవ‌స‌రం దృష్ట్య మ‌ట్టితో ప్ర‌త్యేక ప్లాస్క్ ను తాయారు చేయించింది..దీని ద్వార కుల‌వృత్తుల‌ను ప్రోత్స‌హించ‌డంతో పాటు ప‌ర్య‌వ‌ర‌ణాన్ని కాపాడవ‌చ్చ‌ని ఎంబీసీ కార్పోరేష‌న్ చైర్మ‌న్ తాడూరి శీనివాస్ అన్నారు… ..ఇందులో భాగంగానే మట్టి ప్లాస్క్ ను ఎమ్మెల్యేలు, ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు అందించ‌నున్న‌ట్టు ఆయ‌న తెలిపారు..ఈనేప‌థ్యంలోనే ప్లాస్క్ ను మంత్రి జోగు రామ‌న్న ఎంబీసీ కార్పోరేషన్ సీఈవో అలోక్ కుమార్ తో క‌లిసి స్పిక‌ర్ మ‌ధుసూదన చారీకి అందించారు…ఈ సందర్భంగా స్పిక‌ర్ తోపాటు భార‌తీయ జ‌న‌తా పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎమ్మెల్యే,డా..ల‌క్ష్మ‌న్.తో పాటు పలువురు .ఎమ్మెల్యే లు ఉన్నారు…

244 total views, no views today

శ్రీ ఈటెల రాజేందర్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన శ్రీ తాడూరి శ్రీనివాస్ గారు

ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక మరియు పౌరసరఫరాల శాఖా మాత్యులు శ్రీ ఈటెల రాజేందర్ గారికి మినిస్టర్స్ క్వార్టర్స్ లోని మంత్రి క్యాంపు కార్యాలయం లో కలిసి వారికి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఎం.బీ.సీ కార్పొరేషన్ చైర్మన్, తెరసా రాష్ట్ర కార్యదర్శి శ్రీ తాడూరి శ్రీనివాస్ ప్రజాపతి గారు.

తాడూరి మాట్లాడుతూ ఈటెల రాజేందర్ గారికి ఆ దేవుడు ఆయురుఆరోగ్యాలు,అష్ఠాఐశ్వర్యాలు, ప్రసాదించాలని ఆ దేవుళ్లను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రంలో ఆయన వెంట TRMBC రాష్ట్ర ఎన్నికల కన్వీనర్ గడ్డం సాయి కిరణ్ , తాడూరి ఉదయ్,సాయి ప్రసాద్,నర్సింహ, ఇతర ఎం.బీ.సీ నాయకులు , కార్యకర్తలు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.

244 total views, 4 views today

సంక్షేమ భవన్,మాసబ్ ట్యాంక్. చాయ్ పే ములాఖత్ లొ పాల్గొన్నా తెరసా రాష్ట్ర కార్యదర్శి శ్రీ తాడూరి శ్రీనివాస్

ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఎం.బీ.సీ కార్పోరేషన్ చైర్మన్,తెరసా రాష్ట్ర కార్యదర్శి శ్రీ తాడూరి శ్రీనివాస్ ప్రజాపతి గారి కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ శ్రీ తిరుమల రెడ్డి, ఫుడ్ కమిషన్ మెంబర్ ఆనంద్ గారు,రాష్ట్ర బీ. సీ కమిషన్ మెంబర్స్ శ్రీ వకుళాభరణం కృష్ణమోహన్ రావు గారు, ఎడిగే ఆంజనేయులు గౌడ్, గార్లతో కలిసి చాయ్ పే ములాఖత్ నిర్వహించారు .

ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం శుభపరిణామం అని సభ్యులు తాడూరి శ్రీనివాస్ గారిని అభినందించారు, అనంతరం తాడూరి మాట్లాడుతూ నాయకులతో , కార్యకర్తలతో ఇలా మమేకం కావడం వారిలో ఉత్సహం కలిగించడం కె.సీ.ఆర్ గారి నుండి నేర్చుకున్నానని ఆయన అన్నారు. అనంతరం ఆయన గౌరవ సభ్యులను శాలువా తో సన్మానించారు.
ఈ కార్యక్రంలో బీ .సీ సంఘం రాష్ట్ర నాయకులు మొప్పు భిక్షపతి, TRMBC రాష్ట్ర కన్వీనర్ గడ్డం సాయి కిరణ్, TRMBC హైదరాబాద్ కన్వీనర్ అనూప్, తెరసా నాయకులు దూసరి శ్రీనివాస్ గౌడ్,తాడూరి ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.

228 total views, 2 views today

శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లో ఈరోజు ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని ఎం.బి.సి కార్పొరేషన్ చైర్మన్

ECIL క్రాస్ రోడ్స్ లో గల శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లో ఈరోజు ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని ఎం.బి.సి కార్పొరేషన్ చైర్మన్ శ్రీ తాడూరి శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు.

విద్యార్థులు ఏర్పాటు చేసిన వివిధ సైన్స్ ప్రాజెక్టు లను ఉపద్యాయులతో పాటు తాడూరి ఒక్కొక్కటిగా సందర్శించారు. విద్యార్థులు వారు తయారుచేసిన ప్రోజెక్టుల గురించి వివరించిన తీరు తనని ఆకట్టుకున్నట్టు తాడూరి తెలిపారు.

శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు కేవలం విద్యలోనే కాదు అన్ని రంగాలలో ముందుకు వెళ్లాలని, ఉపాధ్యాయులు విద్యార్థులను వారికి ఆసక్తి ఉన్న రంగాలలో తీర్చిదిద్దాలని, దానికి అనుగుణంగా తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలని అన్నారు. అప్పుడే పిల్లలు అభివృద్ధి చెందుతారని రాబోయే రోజుల్లో మన తెలంగాణ విద్యార్థులు భారతదేశంలో నే మొదటి స్థానంలో నిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా పేద విద్యార్థులు అందరూ ఉన్నత చదువులు చదవాలన్న ఉధ్యేశంతో 119 బి సి గురుకుల విద్యాలయాలను ఒకే రోజు ప్రారంభించారని, కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నారని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

228 total views, 2 views today

చిలుకా నగర్ లో సుర్ మౌంట్ స్కూల్ ఆఫ్ ఏక్సేలేన్స ప్రారంభ కార్యక్రమం లో శ్రీ తాడూరీ శ్రీనివాస్ గారు

ఈ రోజు ఉప్పల్ నియోజకవర్గం చిలుకా నగర్ లో సుర్ మౌంట్ స్కూల్ ఆఫ్ ఏక్సేలేన్స ప్రారంభ కార్యక్రమం లో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ సీ.హెచ్ మల్లా రెడ్డీ గారు, తెలంగాణ రాష్ట్ర ఏం.బీ.సీ కార్పొరేషన్ చైర్మన్,తేరాసా రాష్ట్ర కార్యదర్శి శ్రీ తాడూరీ శ్రీనివాస్ గారు, ఉప్పల్ టీ.ఆర్.ఎస్ ఇన్చార్జ బేతి సుభాష్ రెడ్డీ గార్లు ముఖ్యాతిదులు పోల్గోన్నారు

తాడురీ మాట్లాడుతూ చిలుకా నగర్ లో ఇలాంటి ఎక్సలెన్స్ స్కూల్స్ రావడం శుభపరినామం అని అన్నారు. విద్యార్ధులు బాగా చదువుకొని తల్లిదండ్రులు కు, దేశానికి కీర్తి ప్రతిష్టలు తేవాలని ఆయన విద్యార్దులకు ఉద్భోదించారు. అనంతరం ఆయన పరీక్షల్లో ప్రతిభ చూపిన విద్యార్ధులకు మేడల్స్ ప్రశంస పత్రాలు అందజేశారు

ఈ కార్యక్రమం లో కార్పొరేటర్లు గోపు సదానంద్. మేకల అనాలా హన్మంత్ రెడ్డీ,గంధం నాగేశ్వర రావు,తెరెసా నాయకులు బన్నాల ప్రవీణ్, నాయకులు, పలువురు జర్నలిస్ట్ లు తిరుపతి రెడ్డీ,సాగర్,మహేందర్ రెడ్డీ తదితరులు పాల్గొన్నారు.

214 total views, no views today

శ్రీ తాడూరీ శ్రీనివాస్ గారి క్యాంపు కార్యాలయం లో ఆర్.ఏం.పీ & పీ.ఏం.పీ డాక్టర్స్ అసోసియేషన్ సభ్యులు

కుషాయిగూడ లో తెలంగాణ రాష్ట్ర ఏం.బీ.సీ కార్పొరేషన్ చైర్మన్, తెరెసా రాష్ట్ర కార్యదర్శి శ్రీ తాడూరీ శ్రీనివాస్ గారి క్యాంపు కార్యాలయం లో ఆర్.ఏం.పీ & పీ.ఏం.పీ డాక్టర్స్ అసోసియేషన్ సభ్యులు సమావేశమయ్యారు. వారి యొక్క సమస్యలను తాడూరీ కీ విన్నవించారు.

కనీసం రోడ్డు సదుపాయం కూడా లేని మారుమూల గ్రామాల్లో భిదరికంతో బాధ పడుతున్న ఎంతోమంది భీదవారికి తక్కువ ఖర్చుతో ప్రాథమిక చికిత్సను ఆందోస్తూ వారికి అవసరమైతే తదుపరి వైద్యానికి ఎక్కడికి వెళ్తేబాగుంటుంది అనే విషయాన్ని సూచిస్తామని వారు తెలిపారు. కానీ ఇప్పుడు వారి పరిస్థితి దారుణంగా ఉందని స్టేతస్కోప్, బి.పి నియంత్రణ యంత్రాలు వాడటం నేరమని పోలీసులు వారిపై 420, 188 లాంటి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి ఇబ్బంది పాలు చేస్తున్నారని, వాటి పై వారికి తగు న్యాయం చేయాలని, వారి సమస్యలను ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి దృష్టి కి తీసుకువెళ్లాలని వారు తాడూరిని కోరారు. దీనిపై తాడూరి సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు.

తాడూరి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సమాజానికి సేవ చేసే వారికి ఎప్పుడు అండగా ఉంటుందని, అంగన్వాడీ లను, ఆశ వర్కర్స్ ను, హోంగార్డ్స్ లను గుర్తించి వారికి తగు న్యాయం చేసిన గొప్ప ప్రభుత్వం తెలంగాణ అని తెలిపారు. ఉద్యమంలో ఆర్ ఎం పి డాక్టర్లు చేసిన సేవ ను కె.సి.ఆర్ గారు మరువలేదని త్వరలోనే వైద్య శాఖామాత్యులు గారి దృష్టికి, వారి సహకారంతో ముఖ్యమంత్రి గారి దృష్టికి సమస్యలను తీసుకెళ్తామని తాడూరి తెలిపారు.

238 total views, 4 views today

కోదాడ భహిరంగసభకు చేరుకున్న తెలంగాణా రాష్ట్ర ఎం.బీ.సీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ తాడూరి శ్రీనివాస్ ప్రజాపతి గారు

కోదాడ నాభి శిలా బొడ్డురాయి ప్రతిష్ట మహోత్సవానికి హాజరై యాగశాల లో కోదాడ మున్సిపల్ చైర్మన్ వంటిపులి అనిత గారు, ఎం.బీ.సీ సూర్యపేట్ జిల్లా అధ్యక్షులు వంటిపులి నాగరాజు గార్లతో కలిసి తెలంగాణ రాష్ట్ర ఎం.బీ.సీ కార్పొరేషన్ చైర్మన్ , తెరసా రాష్ట్ర కార్యదర్శి శ్రీ తాడూరి శ్రీనివాస్ ప్రజాపతి గారు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ భక్తి భావం తో కోదాడ పట్టణం లో ఇలాంటి పూజలు యాగాలు నిర్వహించండం సంతోషకరం అని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమం లో ఆయన వెంట కోదాడ మున్సిపల్ చైర్మన్ వంటిపులి అనిత నాగరాజు , ఎం.బీ.సీ రాష్ట్ర ఎలక్షన్ కన్వీనర్ గడ్డం సాయి , ఎం.బీ.సీ నాయకులు దుంకుంట్ల నరేష్, ఉప్పల్ నియోజకవర్గం తెరసా నాయకులు నెర్ధం భాస్కర్ గౌడ్, సప్పిడి శ్రీనివాస్ రెడ్డి , నవీన్, తదితరులు పాల్గొన్నారు

510 total views, no views today