గుజరాత్ లోని వివిధ ప్రాంతాలలో పర్యటించి హైద్రాబాద్ చేరుకున్న ఎం.బిసి కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్

కుల వృత్తుల వారికి తెలంగాణ ప్రభుత్వం చేయూతను అందించడానికి ఇవ్వబోతున్న ఆధునిక యంత్రాల పని తీరుని, పరిశ్రమలను పరిశీలించేందుకు మూడు రోజుల పాటు గుజరాత్ లోని వివిధ ప్రాంతాలలో పర్యటించి హైద్రాబాద్ చేరుకున్న రాష్ట్ర బి.సి శాఖ మాత్యులు శ్రీ జోగురామన్న గారికి, ఎం.బిసి కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ గారికి, బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు గారికి, ఎంబీ.సి కార్పొరేషన్ సి ఈ ఓ అలోక్ కుమార్ గారికి శంషాబాద్ విమానాశ్రయంలో రాష్ట్ర కుమ్మరి సంఘం నాయకులు, తెలంగాణ రాష్ట్ర ఎం.బి.సి. సంక్షేమ సంఘం కన్వినర్ గడ్డం సాయి కిరన్, తదితరులు ఘనంగా స్వాగతం పలికారు.

108 total views, 2 views today

ఆధునిక యంత్రాలను పరిశీలించేందుకు గుజరాత్ పర్యటిస్తున్న ఎం.బి.సి కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్

84 total views, 2 views today

మిట్టికూల్ పరిశ్రమను సందర్శించిన ఎంబీసీ కార్పొరేషన్ ఛైర్మన్ తాడూరి శ్రీనివాస్ ప్రజాపతి గారు

ఈరోజు శనివారం గుజరాత్ రాష్ట్రం రాజ్ కోట్ శివారులోని వాంఖేనేర్ గ్రామంలో ఉన్న మిట్టికూల్ పరిశ్రమను సందర్శించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న గారు, ఎంబీసీ కార్పొరేషన్ ఛైర్మన్ తాడూరి శ్రీనివాస్ ప్రజాపతి గారు, బోథ్ నియజవర్గ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు గారు.

మిట్టికూల్ పరిశ్రమ లో మట్టిని ఉపయోగించి తయారు చేసిన రిఫ్రిజిటర్ ( ఫ్రిడ్జ్ ) , మట్టి కుక్కర్లు, మట్టి ప్యాన్లు, లాంతర్లు, బిర్యానీ హాండలుతో పాటు కనీసం100 రకాల మట్టి వస్తువులు ఉన్నాయి.

మిట్టికూల్ పరిశ్రమతో త్వరలోనే ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు మంత్రి జోగు రామన్న, ఎంబీసీ ఛైర్మన్ తాడూరి శ్రీనివాస్ తెలిపారు.

గుజరాత్ లోని రెండు సంస్థలతో ఎంవోయూ ను త్వరలోనే చేసుకొనున్నట్లు వారు తెలిపారు.

తెలంగాణలోని సుమారు 6 లక్షల మంది కుమ్మరి వృత్తి దారులలో… మొదటి విడతగా కొంత మందికి అత్యాధునిక పద్దతి లో వివిధ రకాల మట్టి వస్తువులు, పాత్రల తయారీ కోసం ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ ఇచ్చి వారికి సబ్సిడీ తో ఇటువంటి ఆధునిక యంత్రాలను అందిచబోతున్నామని వారు తెలిపారు.

వారి వెంట గుజరాత్ పర్యటనలో ఎంబీసీ సీఈవో అలోక్ కుమార్, కుమ్మరి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ రావు నేతృత్వంలో ప్రథనిది బృందం లో ఆనంద్, గోవర్ధన్, బాలకృష్ణ, లక్ష్మీ నారాయణ, రాజమల్లు, దయానంద్, తాడూరి ఉదయ్ తదితరులు ఉన్నారు.

80 total views, 2 views today

శ్రీ తాడూరి శ్రీనివాస్ గారు ఆధునిక కుమ్మరి యంత్రాలను పరిశీలించారు : అహ్మదాబాద్ లోని గుజరాత్

అహ్మదాబాద్ లోని గుజరాత్ రాష్ట్ర సంక్షేమ శాఖ మాత్యులు ఆర్. ఈశ్వర్ పర్మార్ జి గారిని తన కార్యాలయంలో కలిసిన తెలంగాణ రాష్ట్ర బి.సి. శాఖామాత్యులు శ్రీ జోగురామన్న గారు, ఎం.బి.సి కార్పొరేషన్ చైర్మన్ శ్రీ తాడూరి శ్రీనివాస్ గారు, బోథ్ నియోజక వర్గ శసనసభ్యులు శ్రీ రాథోడ్ బాపురావు గారు, ఎం.బి.సీ కార్పొరేషన్ సి.ఈ.ఓ అలోక్ కుమార్ గారు.

గుజరాత్ లోని బి.సి ల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న సంక్షేమ కార్యక్రమాల గురించి కాసేపు చర్చించారు.

అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బి.సి., ఎం.బి.సి ల కోసం ప్రవేశ పెట్టిన పథకాల గురించి, బి.సి గురుకుల విద్యా విధానం గురించి అక్కడి అధికారు లు, మంత్రి గారు అడిగి తెలుసుకునట్టు తాడూరి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.

తాడూరి మాట్లాడుతూ గుజరాత్ మటికం కళాకారి అండ్ రూరల్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ యొక్క చైర్మన్ దల్సుఖ్ భాయ్ సి ప్రజాపతి గారి ఆధ్వర్యంలో ఆధునిక కుమ్మరి యంత్రాలను పరిశీలించారు.

కుమ్మరి కులస్థులకు త్వరలో సబ్సిడీ ద్వారా ఈ తరహా ఆధునిక యంత్రాలను అందించబోతునట్టు తెలిపారు. వాటి యొక్క పనితీరుని స్వయంగా మంత్రి జోగురామన్న, తాను చేసి చూసామని వీటిని పేద కుమ్మరులకు అందించడం ద్వారా వారి యొక్క పని చాలా వరకు మెరుగుపడుతుంది అని, పర్యావరణానికి మేలు కలిగించే మట్టి పాత్రల యొక్క ఉత్పత్తి ని పెంచడంతో పాటు వారి ఆర్థికాభివృద్ధికి ఇది ఒక చక్కటి మార్గం అని తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున 3 రోజుల పాటు మంత్రి, ఇతర అధికారులతో గుజరాత్ లోని వివిధ ప్రాంతాలలో వృత్తి పని చేసుకునే వారి కోసం అందించబోయే ఆధునిక యంత్రాలను పరిశీలించేందుకు పర్యటించనున్నట్లు ఆయన వెల్లడించారు.

 

96 total views, no views today

తెరసా రాష్ట్ర కార్యదర్శి ఇంచార్జ్ శ్రీ తాడూరి శ్రీనివాస్ గారు చైతన్యపురి డివిజన్ అభివృద్ధి వెలుగులో పాల్గొన్నారు

ఈ రోజు హైదరాబాద్ చైతన్యపురి డివిజన్ కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి గారి అద్వర్యం లో నిర్వహించిన అభివృద్ధి వెలుగులో చైతన్యపురి డివిజన్-22 ప్రగతి సభకు ముఖ్యాతిధులు గా రాష్ట్ర మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు,మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు మల్లా రెడ్డి గారు,తెలంగాణ రాష్ట్ర ఎం.బీ.సీ కార్పొరేషన్ చైర్మన్ , తెరసా రాష్ట్ర కార్యదర్శి,ఎల్.బీ.నగర్,ఉప్పల్,మల్కాజిగిరి, అంబరపేట నియోజకవర్గాల ఇంచార్జ్ శ్రీ తాడూరి శ్రీనివాస్ ప్రజాపతి గారు పాల్గొన్నారు.

తాడూరి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ అభివృధ్ధి లో మన తెలంగాణ రాష్ట్రం అని దానికి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దూరదృష్టి అని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.చైతన్యపురి డివిజన్ లో 40 కోట్లతో అభివృద్ధి చేసిన కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి గారు సెంచరీ పూర్తిచేయాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

డివిజన్ లో ఉన్న బీ.సీ ,ఎం.బీ.సీ లకు తనవంతు గా ప్రభుత్వం , తన కార్పొరేషన్ ద్వారా రుణాలను ఇప్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు. కె.సీ.ఆర్ గారు ఫెడరల్ ఫ్రంట్ కచ్చితంగా ఫలిస్తుందని, ఈ దేశానికి కె.సీ.ఆర్ గారి నాయకత్వం అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో ఎల్.బీ నగర్ ఇంచార్జ్ ముద్దగోని రామ్మోహన్ గౌడ్,తెరసా నాయకులు,కార్యకర్తలు, డివిజన్ ప్రజలు అత్యధికంగా పాల్గొన్నారు.

144 total views, 2 views today

శ్రీ జోగినిపల్లి సంతోష్ గారిని కలిసి శుభాకంక్షాలు తెలియజేసిన తెలంగాణ రాష్ట్ర ఎం.బీ.సీ కార్పొరేషన్ చైర్మన్

ఈ రోజు ప్రగతి భవన్ లో పార్లమెంట్ సభ్యులు ( రాజ్యసభ ) శ్రీ జోగినిపల్లి సంతోష్ గారిని కలిసి శుభాకంక్షాలు తెలియజేసిన తెలంగాణ రాష్ట్ర ఎం.బీ.సీ కార్పొరేషన్ చైర్మన్ , తెరసా రాష్ట్ర కార్యదర్శి శ్రీ తాడూరి శ్రీనివాస్ ప్రజాపతి గారు, ఆయన వెంట ఎం.బీ.సీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గడ్డం సాయి కిరణ్, పలు జిల్లాల నుండి వచ్చిన ఎం.బీ.సీ నాయకులు , కార్యకర్తలు ఉన్నారు. అనంతరం తాడూరి శ్రీనివాస్ గారు M. B. C నాయకులని సంతోష్ రావు గారికి పరిచయం చేసారు, వారు ఎంతో ఓపిగ్గా అందరితో మాట్లాడి అందరితో ఫొటోలు దిగారు. నాయకులు ఎం.బీ.సీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

76 total views, 2 views today

ఉప్పల్ నియోజకవర్గం శ్రీ సాయి పాఠశాల వార్షికోత్సవ మహోత్సవానికి ముఖ్య అతిధి గా పాల్గొన్న శ్రీ తాడూరి శ్రీనివాస్ గారు

నిన్న సాయంత్రం ఉప్పల్ నియోజకవర్గం చిలుకనగర్ లో శ్రీ సాయి పాఠశాల వార్షికోత్సవ మహోత్సవానికి ముఖ్య అతిధి గా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ఎం.బీ.సీ కార్పొరేషన్ చైర్మన్ , తెరసా రాష్ట్ర కార్యదర్శి శ్రీ తాడూరి శ్రీనివాస్ గారు,ఉప్పల్ శాసనసభ్యులు NVSS ప్రభాకర్ గారు పాల్గొన్నారు.

తాడూరి శ్రీనివాస్ గారుమాట్లాడుతూ విద్యార్ది దశ నుండే గొప్పగా ఆలోచనలు చేస్తే భవిష్యత్తు లో గొప్ప వ్యక్తులు గా కీర్తించబడుతారు అని అన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు సహకారం అందించి వారికి స్వేచ్ఛ వాతావరణం లో పెంచి దేశానికి గొప్ప పౌరులను అందించాలని కోరారు. మాతృ భాష అయిన తెలుగు ను విద్యార్థులకు బోధించి మన సంస్కృతిని కాపాడే భాద్యత ఉపద్యాయులదేనని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో ఆయన వెంట నాయకులు అంబటి జగదీష్ ముదిరాజ్, తెలంగాణ సంపత్,కార్యకర్తలు, ఉపాధ్యాయులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

92 total views, 2 views today

ఖమ్మం లోని R&B గెస్ట్ హౌస్ లో తెలంగాణ రాష్ట్ర ఎం.బి.సి. ప్రెస్ మీట్ లో ఎం.బి.సి కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ గారు

ఖమ్మం లోని R&B గెస్ట్ హౌస్ లో తెలంగాణ రాష్ట్ర ఎం.బి.సి. సంక్షేమ సంఘం జిల్లా కన్వీనర్ శ్రీమతి షకీన సిద్ద గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఎం.బి.సి కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ గారు, ఎస్ సి కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పిడమర్తి రవి పాల్గొన్నారు.

తాడూరి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఎం బి సి ల అభ్యున్నతి కోసం ప్రతి నిమిషం తపిస్తున్న గొప్ప వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని, గత బడ్జెట్ లో 1000 కోట్లు ప్రస్తుత బడ్జెట్లో 1000 కోట్లు కేటాయించిన మహనీయుడు అని తెలిపారు. 70 ఏళ్ల కాలంలో గత పాలకుల చేతుల్లో వెనుకబాటు తనానికి గురయిన బి సి లు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలనలో అభివృద్ధి బాటలో ప్రయనిస్తున్నారని, రాజకీయంగా కూడా తెలంగాణ ప్రభుత్వం బి సి లకు పెద్దపీట వేస్తుందనడానికి నిదర్శనం ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికలలో ఇద్దరు బి సి లకు చోటునివ్వడం అని స్పష్టం చేశారు.

ఫెడరల్ ఫ్రంట్ ద్వారానే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని, అత్యంత వెనుక బడిన వారు జీవితాలు రాజకీయంగా, ఆర్థికంగా ఉన్నత స్థాయి కి ఎదిగిన నాడే దేశం అభివృద్ధి చెందుతుందని భావించారు గనుకే ఫెడరల్ ఫ్రంట్ దిశగా అడుగులు వేస్తున్నట్టుగా చెప్పారు, అందరూ దానికి కట్టుబడి ఉండాలని మద్దతుగా నిలిచి రాబోయే రోజుల్లో మనందరి బ్రతుకులు మార్చుకోవాల్సిన అవసరం మనకెంతయిన ఉందని వెల్లడించారు.

ఎం బిసి ల అభ్యున్నతికి అందరు కట్టుబడి ఉంటేనే ఆర్థికాభివృద్ధి సాధ్యపడుతుందని చెప్పారు, త్వరలోనే స్కీమ్స్ యొక్క రూపకల్పన పూర్తి అవుతుందని, అన్ని కుల సంఘ నాయకుల నుండి తగు వివరాలు సేకరించి వారికి కావాల్సిన విధంగా స్కీమ్స్ యొక్క రూపకల్పన జరుగుతుందని, దీని ద్వారా బ్యాంకుల తో సంబంధం లేకుండా రుణాలు ఇచ్చే కార్యక్రమాలు మొదలుపెట్టనున్నట్లు తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో ఎం.బి.సి నాయకులు దరిపెల్లి శ్రీనివాస్, రామ్మూర్తి, దరిపెల్లి కిరణ్, నర్సింహారావు పూసల, కోరం శ్రీనివాస్, ఉపేందర్, వెంకన్న వడ్డెర, స్థానిక కుల సంఘ నేతలు తదితరులు పాల్గొన్నారు.

86 total views, 2 views today

హాలియా లో నిర్వహించిన తెలంగాణ కుమ్మర సంఘం ఆధ్వర్యంలో ఎం.బిసి కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ గారు

తెలంగాణ కుమ్మర సంఘం ఆధ్వర్యంలో నాగార్జునసాగర్ నియోజకవర్గం లోని హాలియా లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి బహిరంగ సభకు ఎం.బిసి కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ గారు, నియోజకవర్గ ఇంచార్జి మాజీ శాసన సభ్యులు నోముల నర్సింహయ్య గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ వై వి రావు గారు, విజయేందర్ రెడ్డి గార్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

తాడూరి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తరువాత జరిగిన అభివృద్ధి గత 70 సం ల కాలంలోని పాలకులు చేయలేకపోయారని అన్నారు.

కానీ తెలంగాణ ఏర్పడిన మూడున్నర సంవత్సరాల కాలంలోనే రాష్ట్రం లో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి అని, అందులో భాగంగానే అత్యంత వెనుక బడిన వారిని గుర్తించడం అనేది ఎంతో గొప్ప విషయం అని చెప్పారు.

ఎం బి సి కులస్తులు అందరూ గతంలో ఎంతో సాంస్కృతిక వైభవం కలిగి ఉండి గొప్పగా జీవనం సాగించారు అని ఆయన చెప్పారు.

తెలంగాణ రాష్ట్రం లో కె సి ఆర్ గారు సుపరిపాలన సాగిస్తు ఎం.బి.సి లకు పెద్ద పీట వేస్తున్నారని, ఎంబీ.సి లు ఆర్థికంగా, అభివృద్ధి చెందాలనేది కె సి ఆర్ గారి ఆశయం అని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం దేశంలోని మొత్తం బిసి లకు కేవలం 1980 కోట్లు కేటాయిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం రాష్ట్రం లోని బి సి ల ఆర్థికాభివృద్ధికి 5940 కోట్లు కేటాయించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ఎం బి సి కార్పొరేషన్ ద్వారా తమ కార్యాలయంలో అన్ని కుల సంఘ నాయకులతో ఇప్పటికే చర్చలు జరిపినట్టు, వారి వారి ఆర్థికాభివృద్ధి కి తీసుకోవాల్సిన చర్యల గురించి వివరాలు సేకరించి, కార్యాచరణ రూపొందిస్తున్నామని అన్నారు.

త్వరలోనే నివేదిక రూపొందించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లబోతున్నామని తాడూరి తెలిపారు.

వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చే కార్యక్రమాలు ఎం.బి.సి కార్పొరేషన్ ద్వారా చేపట్టనున్నట్టు, వృత్తి ని ఆధునీకరించి వారి యొక్క ఆర్థికాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, అత్యాధునిక యంత్రాలను పరిశీలించేందుకు మంత్రి వర్యులు జోగు రామన్న గారు, అధికారులు, కుల సంఘ నాయకుల తో కలిసి త్వరలోనే వివిధ రాష్ట్రాల పర్యటన చేయబోతున్నమని వివరించారు.

ఎం.బి.సి లకు రాజ్యాధికారం కల్పించాలని సంకల్పించిన కె సి ఆర్ గారికి పాదాభివందనాలు తెలిపారు. నిన్న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కూడా ఇద్దరు బి సి బిడ్డలకు చోటు నివ్వడం అనేది చరిత్రలో ఎప్పుడు జరగలేదని చెప్పారు. త్వరలోనే కె సి ఆర్ గారి పాలనలో ఎం బి సి లు ఉన్నత స్థాయికి చేరుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో కుమ్మర సంఘం అధ్యక్షులు నడికుడి జయంత్ రావు, యువత విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు బొడ్డుపల్లి చంద్రశేఖర్, దయానంద్, రాజమల్లయ్య, భిక్షపతి, బాలకృష్ణ ఇతర స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

82 total views, no views today