రాష్ట్రంలో తొలి బోనం సమర్పించిన కుమ్మరులు – ఎం బి సి చైర్మన్ తాడూరి శ్రీనివాస్

తేదీ 04.07.2019

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు బోనాలు సంబురాలు అట్టహాసంగా మొదలయ్యాయి, అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో తొలి బోనాన్ని గోల్కొండలోని శ్రీ జగదంబిక అమ్మవారికి సమర్పించిన తరువాత ఎం బి సి కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ గారి మార్గదర్శకంతో, ట్యాంక్ బండ్ పై గల కట్ట మైసమ్మ తల్లికి 516 బోనాలను కుండలలో సమర్పించారు.

ఈ 516 బోనాలతో కూడిన శోభయాత్రను రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, ఎంబిసి కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ గారి సతీమణి తాడూరి శ్రీలత గారికి తొలి బోనంను ఎత్తి శోభ యాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర ట్యాంకు బండ్ మీదుగా కట్ట క్రింద గల కనకాల కట్ట మైసమ్మ దేవాలయం వరకు సాగింది.

ఈ కార్యక్రమంలో ఎం బి సి కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, బి సి వెల్ఫేర్ కార్యదర్శి బుర్రా వెంకటేశం IAS, సికింద్రాబాద్ TRS ఎం పి అభ్యర్థి తలసాని సాయి కిరణ్ యాదవ్, సైదా నాయక్ , ఎంబిసి సీఈఓ ఆలోక్ కుమార్, బి సి గురుకులాల సెక్రటరీ మల్లయ్య బట్టు, కుమ్మరి సంఘం రాష్ట్ర అధ్యక్షులు జయంత్ రావు, ఉత్సవ కమిటీ అధ్యక్షులు నగేష్, రాజమల్లయ్య, దాయానంద్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ లో మరో 119 గురుకులాల ఏర్పాటు అభినందనీయం – ఎం బి సి చైర్మన్ తాడూరి శ్రీనివాస్

తెలంగాణ లో మరో 119 గురుకులాల ఏర్పాటు అభినందనీయం – ఎం బి సి చైర్మన్ తాడూరి శ్రీనివాస్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు బడుగు బలహీన వర్గాల విద్య పట్ల ఎంతో చిత్తశుద్ధితో వ్యవహరిస్తూ కేజీ టూ పీజీ లో భాగంగా ఈ రోజు నియోజకవర్గానికి ఒకటి చొప్పున మరో 119 మహాత్మా జ్యోతిభాఫూలే గురుకుల పాఠశాలలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిచడం జరిగింది.

అందులో భాగంగానే మన్సూరబాద్ లో
ముషీరాబాద్, జూబిలీహిల్స్, గోశామహల్ నియోజకవర్గాలకు సంబంధించిన పాఠశాలలను ఈ రోజు ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్యులు మహమూద్ అలీ గారు, కొప్పుల ఈశ్వర్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు మరియు ఎం బి సి కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ గారు, శాసన సభ్యులు ముఠా గోపాల్ గారు, బిసి కమిషన్ చైర్మన్ రాములు గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం గారు, కమిషన్ సభ్యులు కృష్ణ మోహన్, ఆంజనేయులు గౌడ్, గౌరి శంకర్, ఎంబిసి సీఈఓ ఆలోక్ కుమార్ గారు, గురుకుల పాఠశాలల సెక్రటరీ మల్లయ్య బట్టు గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్బంగా తాడూరి శ్రీనివాస్ గారు మట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి 2014 వరకు అరకొర నిధులతో కేవలం 19 పాఠశాలలకే పరిమితమైన గురుకుల పాఠశాలల రూపురేఖలు మార్చి 2017-18 విద్య సంవత్సరంలో ఒకే రోజు 119 గురుకుల పాఠశాలల్ని ప్రారంభించి బడుగు బలహీన వర్గాల పిల్లల భవిష్యత్తును మార్చిన గొప్ప నాయకునిగా ఈ రోజు కేసీఆర్ గారు అందరి మదిలో నిండిపోయారు.

తెలంగాణ అభివృద్ధి చెందాలన్న, కలలు గన్న బంగారు తెలంగాణ సిద్ధించాలన్న కేవలం విద్యారంగంతోనే సాధ్యమవుతుందని విశ్వసించిన ముఖ్యమంత్రి గారు ఎంతో నాణ్యమైన విద్యని అందించడానికి ఎక్కడా వెనుకడుగు వేయకుండా అన్ని విధాలుగా సకల సౌకర్యాలతో కూడిన భవనాలను ఎంపిక చేయడం జరిగింది అన్నారు.

గత సంవత్సరం విద్యార్థులు సాధించిన ప్రగతిని దృష్టిలో పెట్టుకొని, వారి నుండి వస్తున్న అపారమైన ఆసక్తిని పరిగణలోకి తీసుకుని ఈ గురుకుల విద్యని ఇంకా వ్యాప్తి చెందించాలనే ఉధ్యేశంతో ఈ విద్య సంవత్సరం కూడా మరో 119 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయడం జరిగింది అని వెల్లడించారు. ఈ రోజు నాటికి మొత్తము 281 గురుకుల పాఠశాలలు తెలంగాణ వ్యాప్తంగా ఏర్పడటం వల్ల మొత్తం 92,340 మంది విద్యార్థులు కార్పోరేట్ స్థాయి విద్యతో పాటు, ఆటపాటలను పోషక విలువలు కలిగిన ఆహారాన్ని ప్రతి రోజు అందుకుంటున్నారు. అంతేకాక 5335 మంది అధ్యపకులుగా, మరో 2900 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ ఈ పాఠశాలల ద్వారా నియమితులయ్యారు అని తెలిపారు.

శ్రీ ఈటెల రాజేందర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసిన తాడూరి శ్రీనివాస్ గారు

తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖమాత్యులుగా ప్రమాణస్వీకారం చేసిన శ్రీ ఈటెల రాజేందర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసిన రాష్ట్ర ఎం.బి.సి కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ గారు, సంస్థ సీఈవో కిరాడ్ ఆలోక్ కుమార్ గారు.

ఎస్ రావు నగర్ డివిజన్ లో డివిజన్ కార్యాలయాన్ని తాడూరి శ్రీనివాస్ గారు ప్రారంభించారు

11.02.2019 రోజు డా౹౹ ఏ ఎస్ రావు నగర్ డివిజన్ లోని మీ సేవ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన డివిజన్ కార్యాలయాన్ని తెలంగాణ రాష్ట్ర ఎం.బి.సి కార్పొరేషన్ ఛైర్మన్ తాడూరి శ్రీనివాస్ గారు, ఉప్పల్ శాసన సభ్యులు బేతి సుభాష్ రెడ్డి గారు, స్థానిక కార్పొరేటర్ శ్రీమతి పావని మణిపాల్రెడ్డి గార్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాప్ర మునిసిపల్ డీసీ దశరథ, ఈఈ కోటేశ్వర రావు, డీఈ బాలకృష్ణ, మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు తదితరులు పాల్గొన్నారు.

పినపాక నియోజకవర్గ స్థాయి కుమ్మరుల సమావేశానికి ముఖ్య అతిథిగా తాడూరి శ్రీనివాస్ గారు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో పినపాక నియోజకవర్గ స్థాయి కుమ్మరుల సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎం.బి.సి కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ గారు హాజరయ్యారు.

తాడూరి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ నాగరికతను సమాజానికి అందించిన గొప్పవారు కుమ్మరులు అని అభివర్ణించారు. పూర్వం వాడుకలో ఉన్న మట్టికుండలు, పాత్రల యొక్క ప్రాముఖ్యత మళ్ళీ ఈ రోజుల్లో సంతరించుకోవడం గొప్ప విషయం అన్నారు. ఆరోగ్యానికి మేలు చేసే ఈ మట్టి పాత్రలకు ప్రస్తుతం మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కుమ్మరులకు వృత్తినైపుణ్య శిక్షణ ఇచ్చి అధునాతన యంత్రాలను కూడా సబ్సిడీ ద్వారా అందింస్తూ ఉత్పత్తిని పెంచే కార్యక్రమాలను చేపడుతుందని వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 3000 మందికి పైగా కుమ్మరులు ప్రభుత్వం స్వామి రామనందతీర్థ ఇనిస్టిట్యూట్ లో శిక్షణ ను పూర్తి చేసుకున్నారు అని అన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు కులవృత్తుల పట్ల, ఎం.బి.సి కులాల పట్ల ఎంతో చిత్తశుద్ధితో ఉన్నారని, వారి కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు అని అన్నారు. రాష్ట్రంలో సంచార జాతులను, చిన్న చిన్న కులాలను కూడా గుర్తించి వారి ఆత్మగౌరవం నిలబడే విధంగా హైదరాబాద్ నగరంలో కోట్లు విలువచేసే భూమిని ఆత్మగౌరవ భవనాల కోసం కేటాయిస్తూనే వాటి నిర్మాణానికి కోట్ల రూపాయలను నిధిని విడుదల చేసిన విషయాన్ని గుర్తుచేశారు.

కులవృత్తుల పై ఆధారపడి జీవిస్తున్న మెదరి, కుమ్మరి, కమ్మరి, విశ్వకర్మ, రజక, నాయి బ్రాహ్మణ లాంటి కులాలే కాకుండా బుడుబుక్కల, కాటిపాపాల, గంగిరెద్దుల వంటి అత్యంత వెనుకబడిన ఎన్నో కులాలు ఈ రోజు కూడా వారి వారి కులవృత్తులు చేసుకుంటూ సాధారణ జీవనాన్ని గడుపుతున్నారు అని కానీ వారు ఆర్థికంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. అందుకు ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతుందని వెల్లడించారు. గత 70 సంవత్సరాలలో ఏనాడు వీరిని పట్టించున్న ప్రభుత్వాలు లేవని కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కేసీఆర్ గారు ప్రత్యేక చొరవతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి వారి ఆర్థిక, రాజకీయ మనుగడకు బాటలు వేస్తున్నారు అని అన్నారు.

ఈ కార్యక్రమంలో కుమ్మరి సంఘ రాష్ట్ర నాయకులు రాజమల్లయ్య, TRMBC భద్రాద్రి కన్వీనర్ కొలిచలం నవీన్, దరిపెళ్లి శ్రీనివాస్ బడిష శంకర్ రావు తదితరులు పాల్గొన్నారు.

హరిత హారం కార్యక్రమంలో ఎం.బి.సి కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ గారు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరిత హారం కార్యక్రమంలో భాగంగా ఎం.బి.సి కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ గారు, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవి ప్రసాద్ గారితో కలిసి మొక్కను నాటుతున్న దృశ్యం.

170 total views, no views today

100% సబ్సిడీతో రుణం ముఖ్య అతిథిగా ఎం.బి.సి కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ గారు

స్వాతంత్య్ర దినోత్సవం రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి చేతుల మీదుగా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 100% సబ్సిడీతో కూడిన బి.సి. రుణాలు లబ్దిదారుల ఖాతాల్లోకి చేరాయి.

మహేశ్వరం నియోజకవర్గం కొత్తపేట లోని ఎం.బి.సి చెందిన బుడుబుక్కల కులస్తులకు పలువురికి లభించిన 50 వేల రూపాయలతో పూలు అమ్మే బండి ని మరియు మొక్క జొన్నలు అమ్మే బండ్లను ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎం.బి.సి కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.

లబ్దిదారులు మాట్లాడుతూ తమ జీవితం ఈ రుణం ఎంతగానో ఉపయోగపడింది అని, ఇప్పటివరకు ఏ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదని, కానీ కె.సి.ఆర్ సారు మా ఇంటి పెద్దకొడుకులాగా నిలబడి మా కష్టాలను గుర్తించి మాకు 100% సబ్సిడీతో రుణం అందించడం చాలా సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. జీవితాంతం కె.సి.ఆర్ గారికి రుణపడి ఉంటామని అన్నారు.

తాడూరి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ కె.సి.ఆర్ గారు దృఢ నిశ్చయంతో బి.సి ల కొరకు కష్టపడుతున్నారని, గత 70 సంత్సరాలలో ఎవరు ఎం.బి.సి లను గుర్తించలేదని, దేశంలోనే మొట్ట మొదటి సారిగా 1000 కోట్ల రూపాయలతో ఒక కార్పొరేషన్ ఏర్పాటుచేయడం గొప్ప విషయం అన్నారు. త్వరలోనే మిగతా రుణాలను విడుదల చేయబోతునట్టు వివరించారు.

ఈ కార్యక్రమంలో బుడుబుక్కల సంఘ రాష్ట్ర అధ్యక్షులు సురేష్, ఎం.బి.సి రాష్ట్ర కో కన్వీనర్ దూగుంట్ల నరేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ టంగుటూరి నాగరాజు ఇతర ఎం.బి.సి రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.

176 total views, no views today

ఇండోర్ స్టేడియం లో శాల్యూట్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో శ్రీ తాడూరి శ్రీనివాస్ ప్రజాపతి గారు

సరూర్ నగర్, ఇండోర్ స్టేడియం.

19.08.2018 రోజు సాయంత్రం సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం లో శాల్యూట్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో తెలంగాణా రాష్ట్రం సరూర్ నగర్ ఇండొర్ స్టేడియం లో సెప్టెంబర్ నెల 8 , 9 తేదీ లల్లో జరగబోయే బుడో ఖాన్ కరాటే ఛాంపియన్ షిప్ పైన నిర్వహించిన ప్రెస్ మీట్ లో ముఖ్యఅతిధిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ఎం.బీ.సీ కార్పొరేషన్ ఛైర్మన్, తెరాస రాష్ట్ర కార్యదర్శి శ్రీ తాడూరి శ్రీనివాస్ ప్రజాపతి గారు, తెలుగు సినీ నటుడు శ్రీ సుమన్ గారు, స్థానిక కార్పొరేటర్ అనితా దయాకర్ రెడ్డి, నిర్వాహకులు కనకరాజు , సీ హెచ్ హన్మంతరావు , విజయ రంగ తదితరులు పాల్గొన్నారు.

188 total views, 2 views today

బోనాల పండుగ కు తెరాస రాష్ట్ర కార్యదర్శి శ్రీ తడూరి శ్రీనివాస్ ప్రజాపతి గారు

16.08.2018 రోజు ఉప్పల్ నియోజకవర్గం ఉప్పల్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి మేకల అనలా హన్మంత్ రెడ్డి గారి ఆద్వర్యం లో నిర్వహించిన బోనాల పండుగ కు ముఖ్యఅతిధిలుగా రాష్ట్ర హోంశాఖ మంత్రి శ్రీ నాయిని నర్సింహారెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ఎం.బీ.సీ కార్పొరేషన్ ఛైర్మన్ , తెరాస రాష్ట్ర కార్యదర్శి శ్రీ తడూరి శ్రీనివాస్ ప్రజాపతి గారు, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ గారు , తెరాస ఉప్పల్ ఇంచార్జ్ బెతి సుభాష్ రెడ్డి , కార్పొరేటర్లు, తెరాస నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఉప్పల్ నియోజకవర్గంలో చాయ్ పే ములాఖత్ కార్యక్రమంలో ఎం.బి.సి కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ గారు పాల్గొన్నారు

ఉప్పల్ నియోజకవర్గంలో ని హబ్సిగూడ డివిజన్ వెంకటరెడ్డి నగర్ లోని విశ్వకర్మ కులస్తులు వెంకటేశ్వర చారి గారి నివాసంలో నిర్వహించిన చాయ్ పే ములాఖత్ కార్యక్రమంలో ఎం.బి.సి కార్పొరేషన్ చైర్మన్, తెరాస రాష్ట్ర కార్యదర్శి తాడూరి శ్రీనివాస్ గారు పాల్గొన్నారు.

తాడూరి శ్రీనివాస్ గారు స్థానికులతో చాయ్ తాగుతూ కాసేపు సరదాగా ముచ్చటించారు. వారు మాట్లాడుతూ చాయ్ పే ములాఖత్ లాంటి వినూత్న కార్యక్రమాలు నాయకులకు ప్రజలకు మధ్య వారధిలా పనిచేస్తూన్నాయని, ప్రజల యొక్క సమస్యలని తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయొచ్చు అని చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు.

నూతనంగా ప్రవేశపెట్టిన ” రైతు బంధు” లాంటి పథకాలు రైతుల కళ్ళలో ఆనందాన్ని నింపాయి అని ఇది దేశంలోనే రైతాంగానికి ఆదర్శనంగా నిలిచిందని చెప్పారు.

ఎం.బి.సి కార్పొరేషన్ ద్వారా అత్యంత నిరుపేదలయిన బి.సి గుర్తించి వారి ఆత్మగౌరవాన్ని, ఆర్థిక సహకారాన్ని అందించాలని ముఖ్యమంత్రి గారు దృఢ సంకల్పంతో ఉన్నారని, త్వరలోనే ఎం.బి.సి లకు తగిన ప్రాధాన్యత కల్పించడమే ఈ ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు.

ఈ కార్యక్రమంలో మేక శ్రీనివాస్, విశ్వనాథ్ చారి, సుదర్శన్ రెడ్డి, కె.నర్సింహ, మన్సూర్ భాయ్, ఎం.బి.సి నాయకులు గడ్డం సాయి కిరణ్, దూగుంట్ల నరేష్, రవీంద్ర చారి తదితరులు పాల్గొన్నారు.