పినపాక నియోజకవర్గ స్థాయి కుమ్మరుల సమావేశానికి ముఖ్య అతిథిగా తాడూరి శ్రీనివాస్ గారు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో పినపాక నియోజకవర్గ స్థాయి కుమ్మరుల సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎం.బి.సి కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ గారు హాజరయ్యారు.

తాడూరి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ నాగరికతను సమాజానికి అందించిన గొప్పవారు కుమ్మరులు అని అభివర్ణించారు. పూర్వం వాడుకలో ఉన్న మట్టికుండలు, పాత్రల యొక్క ప్రాముఖ్యత మళ్ళీ ఈ రోజుల్లో సంతరించుకోవడం గొప్ప విషయం అన్నారు. ఆరోగ్యానికి మేలు చేసే ఈ మట్టి పాత్రలకు ప్రస్తుతం మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కుమ్మరులకు వృత్తినైపుణ్య శిక్షణ ఇచ్చి అధునాతన యంత్రాలను కూడా సబ్సిడీ ద్వారా అందింస్తూ ఉత్పత్తిని పెంచే కార్యక్రమాలను చేపడుతుందని వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 3000 మందికి పైగా కుమ్మరులు ప్రభుత్వం స్వామి రామనందతీర్థ ఇనిస్టిట్యూట్ లో శిక్షణ ను పూర్తి చేసుకున్నారు అని అన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు కులవృత్తుల పట్ల, ఎం.బి.సి కులాల పట్ల ఎంతో చిత్తశుద్ధితో ఉన్నారని, వారి కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు అని అన్నారు. రాష్ట్రంలో సంచార జాతులను, చిన్న చిన్న కులాలను కూడా గుర్తించి వారి ఆత్మగౌరవం నిలబడే విధంగా హైదరాబాద్ నగరంలో కోట్లు విలువచేసే భూమిని ఆత్మగౌరవ భవనాల కోసం కేటాయిస్తూనే వాటి నిర్మాణానికి కోట్ల రూపాయలను నిధిని విడుదల చేసిన విషయాన్ని గుర్తుచేశారు.

కులవృత్తుల పై ఆధారపడి జీవిస్తున్న మెదరి, కుమ్మరి, కమ్మరి, విశ్వకర్మ, రజక, నాయి బ్రాహ్మణ లాంటి కులాలే కాకుండా బుడుబుక్కల, కాటిపాపాల, గంగిరెద్దుల వంటి అత్యంత వెనుకబడిన ఎన్నో కులాలు ఈ రోజు కూడా వారి వారి కులవృత్తులు చేసుకుంటూ సాధారణ జీవనాన్ని గడుపుతున్నారు అని కానీ వారు ఆర్థికంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. అందుకు ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతుందని వెల్లడించారు. గత 70 సంవత్సరాలలో ఏనాడు వీరిని పట్టించున్న ప్రభుత్వాలు లేవని కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కేసీఆర్ గారు ప్రత్యేక చొరవతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి వారి ఆర్థిక, రాజకీయ మనుగడకు బాటలు వేస్తున్నారు అని అన్నారు.

ఈ కార్యక్రమంలో కుమ్మరి సంఘ రాష్ట్ర నాయకులు రాజమల్లయ్య, TRMBC భద్రాద్రి కన్వీనర్ కొలిచలం నవీన్, దరిపెళ్లి శ్రీనివాస్ బడిష శంకర్ రావు తదితరులు పాల్గొన్నారు.

0 replies

Leave a Reply

Want to join the discussion?
Feel free to contribute!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *